గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతికత పట్ల ఆసక్తిని కలిగించే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రంలోని ఐదు పట్టణాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈనెల 20, 21 తేదీల్లో ఇస్రో ఆధ్వర్యంలో స్పేస్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు కళాశాల సంస్థల ఛైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
అంతరిక్ష ప్రదర్శనలో భాగంగా శాస్త్ర సాంకేతిక ఉపన్యాసాలు, ఉపగ్రహ నమూనాలు, లాంచింగ్ వెహికల్ మోడల్స్, స్పేస్ సైన్స్ క్లబ్ ద్వారా వాటర్ రాకెట్ లాంచింగ్ లాంటి అనేక అంశాలు ఉంటాయని ఆయన తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులకు ఫాన్సీ డ్రెస్ పోటీలు, క్విజ్, పెయింటింగ్, రంగోలి పోటీలను నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి : ఆ ఒక్కటి పక్కనబెడతాం.. మిగతావి పరిష్కరించండి