కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మియావాకి తరహా చిట్టడవుల పెంపకానికి సీపీ కమలాసన్‌రెడ్డి రెండో దఫా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే రెండు చోట్ల మియావాకి తరహాలో మొక్కలు పెంచుతుండగా ఈసారి 50వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు.
పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో 25వేల మొక్కలు నాటడానికి ఏర్పాటు చేశారు. సీపీ కమలాసన్‌రెడ్డితో పాటు కమిషనరేట్ పరిధిలో సీఐలు, ఎస్సైలు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకుంటామని సీపీ కమలాసన్‌రెడ్డి వివరించారు.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్