2017లో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్లో 8మంది లబ్ధిదారులకు ప్రభుత్వం 21 ఎకరాల 27 గుంటల భూమి పంపిణీ చేసింది. పంటల సాగుకు తగినంత పెట్టుబడి లేకపోవడం వల్ల రెండు సంవత్సరాలుగా లబ్ధిదారులు మరొకరి పొలాల్లో పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు.
తాజాగా ప్రభుత్వం దళిత బస్తీ పథకంతో 8 మంది లబ్ధిదారులకు 43 వేల రూపాయల ఆర్థిక సాయం అందించింది. ఈ పథకంతో ప్రభుత్వం ఇచ్చిన మూడెకరాల్లో వ్యవసాయం చేయడానికి ఎనిమిది కుటుంబాలు ఉపక్రమించాయి.
ప్రభుత్వ చేయూతతో వ్యవసాయ కూలీ పనుల నుంచి సొంత వ్యవసాయం చేసుకునే స్థాయికి ఎదిగామని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి: 5 ఎకరాల పొలం.. 23 రకాల పంటలు...