ETV Bharat / state

పెరగనున్న ఆదాయం... కుదుటపడుతున్న ఆర్టీసీ - ఆర్టీసీ ఆదాయం వార్తలు

కరోనా వైరస్‌ వ్యాప్తితో అతలాకుతలమైన ప్రజా రవాణా వ్యవస్థ కుదుటపడుతోంది. లాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమైన బస్సులు మే 19 నుంచి రోడ్డెక్కాయి. అనుకున్నంత ఆదాయం రాలేదు. ప్రస్తుతం క్రమక్రమంగా గాడినపడుతోంది.

rtc-gross-increased-on-soon-after-the-pandemic-in-Karimnagar
పెరగనున్న ఆదాయం... కుదుటపడుతున్న ఆర్టీసీ
author img

By

Published : Nov 3, 2020, 1:07 PM IST

కరోనా నుంచి ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కరీంనగర్‌ రీజియన్‌లో నిత్యం తిరిగే కిలోమీటర్లు పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతోంది. దీనికి తోడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసుల వ్యవహారం కొలిక్కి రావడంతో ఆదాయం మరింత పెరగనుంది. మంగళవారం నుంచి రీజియన్‌ నుంచి ఏపీకి బస్సు సర్వీసులు పునరుద్ధరించనున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు మంథని డిపోకు చెందిన బస్సు సర్వీసును నడుపుతుండగా కర్నాటకకు సైతం బస్సులు తిరిగి ప్రారంభం కానున్నాయి.

రీజియన్‌ నుంచి...

కరీంనగర్‌ రీజియన్‌లోని పలు డిపోల నుంచి 19 సర్వీసులు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలకు వెళ్లనున్నాయి. మరింత ఆదాయం ఆర్జించనుంది. లాక్‌డౌన్‌కు ముందు నిత్యం 21,840 కిలోమీటర్లు తిరగగా సుమారు రూ.6 లక్షల ఆదాయం వచ్చేది. సుదీర్ఘ విరామం (ఏడు నెలల) తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసులు నడపనుండటంతో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో పాటు ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గాడిన పడుతున్న ఆర్టీసీ

లాక్‌డౌన్‌ తర్వాత అంతంత మాత్రంగా ఉన్న ఆర్టీసీ ఆదాయం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. రీజియన్‌లో బస్సులు కరోనా కంటే ముందు నిత్యం 3.50లక్షల కిలోమీటర్లు తిరుగుతూ రూ.1.20 కోట్లు ఆదాయం ఆర్జించేవి. అన్‌లాక్‌ తర్వాత మే 19 నుంచి బస్సులు రోడ్డెక్కినా.. అనుకున్న స్థాయిలో ఆదాయం రాలేదు. ఎట్టకేలకు ఆగస్టు నుంచి ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఆదాయం రూ.64 లక్షలకు చేరగా 2.51 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులతో ఇది మరింత పెరగనుంది.

సర్వీసుల పునరుద్ధరణకు ఏర్పాట్లు చేశాం

తెలంగాణ, ఏపీల మధ్య అంతరాష్ట్ర సర్వీసుల ఒప్పందం కుదరడంతో మంగళవారం నుంచి బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశామని ఆర్​ఎం జీవన్ ప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకకు సర్వీసులు నడిపిస్తామన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు బస్సు నడుపుతున్నామని తెలిపారు. అంతరాష్ట్ర సర్వీసుల ప్రారంభంతో ఆర్టీసీకి ఆదాయం పెరగనున్నట్లు వెల్లడించారు.

ఏపీకి సర్వీసులు ప్రారంభించాం

కరీంనగర్‌-2 డిపో బస్సులు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు వరకు వెళ్లి వచ్చేవని కరీంనగర్​-2 డిపో డీఎం లక్కు మల్లేషం తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర సర్వీసుల ఒప్పందం కుదరడంతో సోమవారం నర్సారావుపేటకు బస్సు సర్వీను పునరుద్ధరించామన్నారు. ఏపీ సరిహద్దు వరకు వెళ్లిన బస్సును నర్సరావుపేట వరకు వెళ్లమని డ్రైవర్‌, కండక్టర్‌కు చెప్పామని... ఈ నెల 3 నుంచి పూర్తిస్థాయిలో సర్వీసులు నడిపిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: తెలుగు రాష్ట్రాల్లో బస్సులు తిప్పేందుకు ఇరు రాష్ట్రాల చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.