కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆర్టీసీ కార్మీకులు భారీ ర్యాలీ నిర్వహించారు. డిపో నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. కార్యాలయంలోకి వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఐకాస నాయకులను మాత్రమే కార్యాలయంలోకి అనుమతించారు. ఆర్డీవో బోయపాటి చెన్నయ్యను కలిసి తమ సమస్యలను వివరించారు. కార్మికులను కార్యాలయంలోకి అనుమతించాల్సిందిగా నాయకులు కోరగా... అనుమతించారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రాన్ని సమర్పించారు. కార్మికులకు భాజపా, జర్నలిస్ట్ సంఘాలు మద్దతు పలికాయి. అంబేడ్కర్ కూడలి వద్ద సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: ఆరో రోజుకు చేరిన టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె