RED CHILLI Price Hike: కరీంనగర్ జిల్లాలో ఎండు మిర్చి ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. మిర్చి దిగుబడి తక్కువగా ఉండటంతో మార్కెట్లో ధర ఆకాశన్నంటుతుంది. గత ఏడాది కిలో ఎండు మిర్చి రూ.130గా ఉంది. ఈ సంవత్సరం రూ. 200 నుంచి రూ. 250 వరకు ధర పలుకుతోంది. ప్రతి శనివారము సంత జరుగుతుంది. ప్రజలు ఎండు మిర్చి ధరను చూసి అమ్మో అంటున్నారు.
ఇదిలా ఉండగా రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉంది. ఎకరం విస్తీర్ణంలో మిరప పంటను సాగు చేస్తే పది క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా .. అది కాస్తా వర్షాల కారణంగా 5 క్వింటాళ్లే వచ్చాయి. పండించిన పంటను అటు ఇంట్లో ఉంచలేక ఇటు మార్కెట్లో తగిన గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ రైతు బజార్లలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే...