అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా విధులు బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు విధుల్లో చేరారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ప్రధాన విభాగంతో పాటు హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయాలన్నీ కిటకిటలాడాయి. వారం పైగా విధులకు దూరంగా ఉన్నందున దస్త్రాలు పేరుకుపోయాయి. సోమవారం జరిగే ప్రజావాణిలో అన్ని తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు రక్షణగా నిలవనున్నారు. అధికారులకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడం వల్లే జిల్లవ్యాప్తంగా రెవెన్యూ అధికారులు విధుల్లో చేరారు.
ఇదీ చదవండిః తాగి రెచ్చిపోయిన గల్లీ లీడర్లు.. జై కొట్టిన పోలీసులు