ETV Bharat / state

'కాంగ్రెస్ మోడల్ అంటే పేదల అభివృద్ధి.. బీజేపీ మోడల్ అంటే గుజరాత్ అభివృద్ధి'

author img

By

Published : Mar 9, 2023, 9:13 PM IST

Updated : Mar 9, 2023, 10:52 PM IST

Karimnagar Congress Public Meeting Update: ఎన్నో కుట్రలు, అవరోధాలు తిప్పికొట్టి సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల గురించి సోనియాగాంధీ ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. కాంగ్రెస్ మాడల్ అంటే పేదల అభివృద్ధి.. బీజేపీ మాడల్ అంటే గుజరాత్ అభివృద్ధి అని ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ భగేల్ అన్నారు. కరీంనగర్ కవాతుకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున కదంతొక్కారు.

Karimnagar Congress Public Meeting
Karimnagar Congress Public Meeting

Karimnagar Congress Public Meeting Update: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర స్ఫూర్తితో తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి 'హాథ్​ సే హాథ్ జోడో యాత్ర' చేస్తున్నారు. తనదైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రేవంత్ రెడ్డి యాత్రను కొనసాగిస్తున్నారు. జోడో యాత్రతో కాంగ్రెస్ శ్రేణులలో నూతనోత్సాహం నెలకొంది. ఈ "హాథ్​ సే హాథ్​ జోడో యాత్ర"లో భాగంగానే గురువారం కరీంనగర్​లోని అంబేడ్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఛత్తీస్​ఘడ్ సీఎం సీఎం భూపేశ్‌ భగేల్‌, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్​రావు ఠాక్రే ముఖ్య అతిధులుగా హాజరైనారు.

వందలాది బిడ్డల ప్రాణ త్యాగాల వల్లే 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నో కుట్రలు, అవరోధాలు తిప్పికొట్టి సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని తెలిపారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి నష్టమని తెలిసి సోనియమ్మ తెలంగాణ ఇచ్చారన్నారు. తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ కరీంనగర్‌లోనే ప్రకటించారన్న రేవంత్.. రాజకీయ ప్రయోజనాల గురించి సోనియాగాంధీ ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు.

కేసీఆర్ చెప్పిన తెలంగాణ మోడల్ ఇదేనా?: రేవంత్‌రెడ్డి

'కేసీఆర్‌ వచ్చాక 3 వేల వైన్‌షాపులు, 60వేల బెల్టుషాపులు వచ్చాయి. కేసీఆర్ చెప్పిన తెలంగాణ మోడల్ ఇదేనా ? బీజేపీ వైపు చూస్తే..పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లే. తల్లిని చంపి పిల్లను బ్రతికించారని మోదీ అవహేళన చేశారు. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తాం. ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. పేద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తాం.'-రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

కాంగ్రెస్ మాడల్ అంటే పేదల అభివృద్ధి.. బీజేపీ మాడల్ అంటే గుజరాత్ అభివృద్ధి అని ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ భగేల్ అన్నారు. కాంగ్రెస్ ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తుంటే.. బీఆర్​ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రజలను దోచుకుంటున్నారన్నారు. రైతు బంధు కింద ఇక్కడ ఎకరానికి 5వేలు మాత్రమే ఇస్తున్నారు.. తాము తొమ్మిది వేలు ఇస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున అందిస్తున్నామన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలే అని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే ధ్వజమెత్తారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ దొందూ దొందే.. సోనియా కలలుగన్న సామాజిక తెలంగాణ ఏర్పడాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకెళ్లేందుకే సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు.

ఛత్తీస్​గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు చూసి ఇక్కడి బీఆర్​ఎస్ ప్రభుత్వం సిగ్గుపడాలని ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి వ్యాఖ్యానించారు. నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామన్న ప్రభుత్వం నిసిగ్గుగా ఆ హామీని గాలికొదిలేసిందన్నారు. తామంతా కలిసికట్టుగా ముందుకు వెళుతున్నాం.. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు 50 శాతం పదవులు ఇవ్వాలని రాయ్​పూర్ సభలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్ కో ఆర్డినేటర్ కొప్పుల రాజు పేర్కొన్నారు. ప్రైవేటు సెక్టారులోనూ నిరుద్యోగులకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామన్నారు.

మతం మత్తులో ముంచే బీజేపీతో, మద్యం మత్తులో ముంచే బీఆర్ఎస్ పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. 8 ఏళ్లలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియమకాలు నెరవేర్చడంలో సీఎం విఫలమయ్యారని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. కేసీఆర్​ను గద్దెనెక్కించిన కరీంనగర్ ప్రజలే ఆయన పాలనకు సమాధి కట్టాలని కార్యకర్తలకు సూచించారు.

ఈ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి, జీవన్​రెడ్డి, శ్రీధర్​బాబు, సీతక్క, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 'కరీంనగర్ కవాతు' పేరుతో నిర్వహించిన ఈ సభకు కాంగ్రెస్ సభకు పార్టీ శ్రేణులు కదంతొక్కారు. భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలతో కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం హోరెత్తింది.

ఇవీ చదవండి:

Last Updated : Mar 9, 2023, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.