కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవికుమార్ క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారని తెలిపారు.
అంబేడ్కర్ కృషి ఫలితంగానే దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం గంగాధర మండలానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు రూ.8 లక్షల 82 వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, పురపాలక ఛైర్మన్ గుర్రం నీరజ పాల్గొన్నారు.