ETV Bharat / state

హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

author img

By

Published : Sep 2, 2020, 5:40 PM IST

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఓ వృద్ధురాలి కడుపులో నుంచి రెండున్నర కిలోల కణతిని తొలగించారు.

హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స
హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఓ వృద్ధురాలి కడుపులో నుంచి రెండున్నర కిలోల కణతిని తొలగించారు. జమ్మికుంట మండలం నాగంపేటకు చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు సంవత్సరం నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. పలు ఆసుపత్రిల చుట్టూ తిరిగినా... ఫలితం లేకుండా పోయింది.

శస్త్ర చికిత్స చేయాలని కరీంనగర్‌కు వెళ్లాలని పలువురు వైద్యులు సూచించారు. ఆపరేషన్‌ చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేకపోయింది. ఈనెల 1న లక్ష్మి... హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రికి కడుపునొప్పితో వచ్చింది. ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి పరీక్షించారు. కడుపులో పెద్దసైజులో కణతి ఉన్నట్లుగా గుర్తించారు. పలు పరీక్షలు నిర్వహించారు.

ఓవేరియన్‌ సిస్ట్‌గా గుర్తించారు. గురువారం ఆర్‌ఎంవో శ్రీకాంత్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి ఓవేరియన్‌ సిస్టెక్టమి ఆపరేషన్‌ను నిర్వహించారు. గంటన్నర సమయంలో ఈ ఆపరేషన్‌ను పూర్తిచేశారు. రెండున్నర కిలోల బరువు గల కణతిని తొలగించారు. లక్ష్మి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.