దేశంలోని అన్ని రాష్ట్రాల పౌర సరఫాల శాఖ మంత్రులతో వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న నిత్యావసర వస్తువుల కొరత, పలు అంశాలపై కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రం తరఫున మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు.
రాష్ట్రంలో గన్నీ సంచుల కొరత, రేషన్ బియ్యం పంపిణీ వంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే పంపిణీ చేయాలని కోరారు. లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన హమాలీలు ఇక్కడికి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవీ చూడండి: పాత పద్ధతిలోనే ధాన్యం సేకరించాలి: జీవన్‌రెడ్డి