కరీంనగర్ జిల్లా కేంద్రంలో వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారి వాతావరణం చల్లగా మారి వాన పడింది. గత రెండు మాసాలుగా వేడితో సతమతమవుతున్న ప్రజలకు వర్షం ఉపశమనాన్ని ఇచ్చింది.
ఈ వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. అన్నదాతలు ధాన్యాన్ని అమ్ముకుందామని ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చారు. వడ్ల కొనుగోలు ఆలస్యమవటంతో ఈ రోజు కురిసిన వానకు ధాన్యం తడిసిపోయింది.
ఇదీ చదవండి: స్పుత్నిక్-వి టీకా తొలి డోసు ఇచ్చిన డాక్టర్ రెడ్డీస్