ETV Bharat / state

చేతికొచ్చిన పంట వర్షార్పణం

ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానకొండూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది.

Telangana latest news
un expected rains
author img

By

Published : May 14, 2021, 10:04 PM IST

కరీంనగర్​ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలో ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నీటిపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని తిమ్మాపూర్, గన్నేరువరం, పారువెల్ల మండలాల్లో వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరోబోసిన ధాన్యం తీసుకునే లోగానే వర్షార్పణమైంది.

తూకం వేసిన బస్తాల కింద నీరు చేరి తడిసిపోయాయి. ఈదురు గాలులకు మామిడి పంట నాశనమైంది. అకాల వర్షాలతో సర్వం కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: కొరత లేనప్పుడు ఇంతమంది ఎలా చనిపోతున్నారు: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.