కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్ కుమార్, సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా భాజపాను మార్చేందుకు ప్రభుత్వపరంగా... పార్టీపరంగా... చర్యలు తీసుకోవాలని ఎంపీలకు సూచించారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్ని ప్రధానమంత్రికి ఎంపీ బాపూరావు అందించారు. మేడారం విశిష్టతలు వివరించారు. ఆసియాలోనే అతిపెద్ద సాంప్రదాయక జాతరగా పేరొందిందని తెలిపారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలను మంత్రి కిషన్ రెడ్డితో పాటు ముగ్గురు ఎంపీలను మోదీ అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చూడండి: అఘాయిత్యానికి పాల్పడింది ఆ నలుగురే