రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమిని పురస్కరించుకుని కరీంనగర్లోని గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో మొక్కజొన్న మద్దతు ధర కోసం రైతులు చేసిన ధర్నా విజయవంతమైందని ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాల ముందు ఏ ప్రభుత్వాలు పని చేయవని వ్యాఖ్యానించారు. తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల మయం చేసి.. ప్రజలను నానా అవస్థలు పెడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండటానికి ప్రయత్నించినా.. ప్రతిపక్షాలు లేవన్నట్టుగా తెరాస ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేయాలని కోరుకున్నట్లు ఆయన వివరించారు.