కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాడు లాంటివని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని రైతులు, ప్రజలతో సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
స్థానికంగా పండించిన ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చంటూ కేంద్రం కార్పొరేట్ శక్తులకు అవకాశం కల్పింస్తుందని ఆరోపించారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యేక బిల్లులు రూపొందించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం కూడా నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించే బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు.
ఇదీ చూడండి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి ఈటల