లాక్డౌన్ కాలంలో పేదల వద్ద వసూలు చేస్తున్న కరెంటు బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ.. కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డిలతో కలిసి నిరసన చేపట్టారు. నల్ల బెలూన్లతో పాటు మూతికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
కరోనా ఉన్నంత కాలం పేదల ఇళ్లకు సంబంధించిన విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నాన్టెలిస్కోపిక్ విధానం ద్వారా విద్యుత్ బిల్లులు లెక్కిస్తున్నందు వల్ల చార్జీలు అధికంగా వస్తున్నాయని.. వెంటనే టెలిస్కోపిక్ విధానం అమలు చేయాలని కోరారు. వెంటనే ప్రభుత్వం కరెంటు బిల్లుల విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కరోనాపై ఇంటి నుంచే యుద్ధం.. హోం ఐసోలేషన్‌లోనే వైద్య సేవలు..