అధికార పార్టీ అక్రమాల వల్లే కరీంనగర్లో ఎన్నికలు రెండు రోజులు ఆలస్యమయ్యాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇతర పార్టీల నాయకులు గెలుపు కోసం ఇష్టారాజ్యంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారన్నారు.
తెరాస, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని, ఆ పార్టీలకు ఓటర్లు గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు. కరీంనగర్లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టేందుకు ఒక ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కొత్త సంఘాల్లో ఓటర్ల జోరు .. హైదరాబాద్ శివారులో మారని తీరు