ETV Bharat / state

కరీంనగర్​లో ఓట్ల పండుగకు సర్వం సిద్ధం - కరీంనగర్​లో ఎన్నికల ఏర్పాట్లు

లోక్​సభ ఎన్నికలకు కరీంనగర్​ జిల్లా సిద్ధమైంది. ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  జిల్లాలో కరీంనగర్​, మానకొండూరు, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, హుజూరాబాద్​, హుస్నాబాద్​ అసెంబ్లీ నియోజవర్గాలు ఉన్నాయి. పోలింగ్​కు సంబంధించిన సామగ్రిని ఎస్​ఆర్​ఆర్​ కళాశాలలో పంపిణీ చేశారు. ఇప్పటికే సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లారు.

పోలింగ్​కు ఏర్పాట్లు
author img

By

Published : Apr 10, 2019, 10:16 PM IST

లోక్​సభ పోరుకు కరీంనగర్​ జిల్లా సిద్ధమైంది. రేపు సాయంత్రంలోగా అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తం కానుంది. పోలింగ్​కు​ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్​ఆర్​ఆర్​ డిగ్రీ కళాశాలలో చొప్పదండి, కరీంనగర్​ నియోజకవర్గాల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు.

కరీంనగర్​ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో 16 లక్షల 61 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. బూత్​కు 1200 మంది ఓటర్ల చొప్పున మొత్తం 2181 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్​ స్టేషన్​ వీడియో రికార్డింగ్​ లేదా లైవ్​ వెబ్​ కాస్టింగ్​ ఉంటుంది. దాదాపు 21వేల మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. సమారు 5వేల మంది పోలీసులను భద్రత కోసం ఉపయోగిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్​ కేంద్రాలు, ఓటర్లు పెరిగారని కలెక్టర్​ సర్ఫరాజ్​ అహ్మద్​ తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వేసవికాలం కావడం వల్ల ఓటర్లకు మంచినీటి సౌకరక్యంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్​ ఏర్పాటు చేశామన్నారు. 2 వేల 73 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామని కలెక్టర్ తెలిపారు.

అన్ని ఏర్పాట్లు చేసినందున ఓటర్లు నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని అధికారులు కోరుతున్నారు. పార్టీలు ప్రలోభాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు.

కరీంనగర్​లో పోలింగ్​కు సర్వం సిద్ధం

ఇదీ చదవండి : ఎన్నికల భారతంలో ఎన్నెన్ని సిత్రాలో..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.