కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టి, 160 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 2200 ప్రముఖ కంపెనీల పేరిట ఉన్న ఖాళీ ప్యాకెట్లు, ఎలక్ట్రానిక్ తూకం ప్యాకింగ్ యంత్రము, రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు.
కరీంనగర్ విద్యానగర్ కు చెందిన మడుపు శ్రీనివాస్ రెడ్డి, పెద్దపెల్లి జిల్లా రంగం పల్లి కి చెందిన ఇందూరి లింగమూర్తి, హుజురాబాద్‌కు చెందిన పెద్ద మల్లురాజు, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చెందిన తుమ్మ సురేష్ రెడ్డి, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన గట్టిలేని రాజేష్‌లను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
నకిలీ విత్తనాలు విక్రయింస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాల గురించి సమాచారం వస్తే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ప్రజలను కోరారు. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ.శశిధర్ రెడ్డిని, ఆర్ ప్రకాష్‌ను పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అభినందించారు.
ఇవీ చూడండి:'ఇకపై సొంతూళ్లకు సమీపంలోనే ఉపాధి'