ETV Bharat / state

3.110కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు నిందితుల అరెస్ట్​

కరీంనగర్​ జిల్లా చెల్పూరు వద్ద అక్రమంగా తరలిస్తున్న 3.110కిలోల గంజాయిని హుజురాబాద్​ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. దాని విలువ సుమారు 25వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

police caught marijuana in karimnagar district
3.110కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు నిందితుల అరెస్ట్​
author img

By

Published : Jul 8, 2020, 11:53 PM IST

గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్న గంజాయిని హుజురాబాద్​ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. రూ.25వేల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్‌ మండలం చెల్పూరు వద్ద ఇద్దరు వ్యక్తులు ఒకరు ఆటోలో, మరొకరు ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్లినట్లు ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు వివరించారు. పక్కా సమాచారంతో వారిని తనిఖీ చేయగా వారి వద్ద రెండు ప్యాకెట్లు లభించినట్లు చెప్పారు. వాటిలో చూడగా గంజాయి ఉన్నట్లు వెల్లడించారు.

తహసీల్దార్‌ బావుసింగ్‌ పంచనామా నిర్వహించినట్లు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. సుమారు రూ.25 వేల విలువ గల 3.110కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా శివగూడ గ్రామానికి చెందిన తిరుపతి, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన గంగారపు తిరుపతిలను అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. వీరి వద్ద నుంచి ఆటో, ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఐ మాధవి, ఎస్సై శ్రీనివాస్,‌ కానిస్టేబుళ్లు మోహన్‌, మహేందర్‌, కుమార్‌లను ఏసీపీ అభినందించారు.

ఇవీ చూడండి: భద్రాద్రిలో 266 కేజీల గంజాయి పట్టివేత.. నిందితుల పరారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.