ETV Bharat / state

PM Modi To Dedicate NTPC Plant To The Nation : అక్టోబరు 3న NTPC విద్యుత్​ ప్లాంట్​ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని - PM Modi To Dedicate NTPC Plant To The Nation

PM Modi To Dedicate NTPC Plant To The Nation: అక్టోబరు 3వ తేదీన నిజామాబాద్​ పర్యటనలో ప్రధాని మోదీ వర్చువల్​గా రామగుండం ఎన్టీపీసీ తొలిదశ విద్యుత్​ ప్లాంటును జాతికి అంకితం చేయనున్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 1600 మెగావాట్ల విద్యుత్​ ప్లాంటు ఇచ్చారు. తొలిదశలో 800 మెగావాట్ల విద్యుత్​ యూనిట్​ అందులోకి రానుంది.

PM Modi will Dedicate NTPC
PM Modi will Dedicate NTPC to Nation at Ramagundam
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2023, 8:25 AM IST

Updated : Sep 30, 2023, 10:22 AM IST

PM Modi To Dedicate NTPC Plant To The Nation అక్టోబరు 3న NTPC విద్యుత్​ ప్లాంట్​ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని

PM Modi To Dedicate NTPC Plant To The Nation : రాష్ట్ర అవసరాల కోసం ప్రత్యేకంగా రామగుండంలో నిర్మించిన ఎన్టీపీసీ(NTPC) విద్యుత్ ప్లాంటు తొలి దశ పూర్తిగా సిద్ధమయ్యింది. విభజన చట్టం ప్రకారం చూస్తే తెలంగాణకు 1600 మెగా వాట్ల(MW) సామర్థ్యం ఉన్న విద్యుత్​ ప్లాంట్​ నిర్మించాల్సి ఉంది. అందులో భాగంగా తొలి దశలో 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన యూనిట్​ అందుబాటులోకి వచ్చింది. అక్టోబరు 3న నిజామాబాద్‌ పర్యటనలో ప్రధాని మోదీ(PM Modi Nizamabad Tour) అక్కడి నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్నారు.

Modi Virtually Dedicates NTPC Plant To The Nation : అప్పటి రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా నిర్మించిన రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు తొలి యూనిట్​ అందుబాటులోకి వచ్చింది. గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 800 మెగావాట్ల యూనిట్‌ను పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తిలోకి ప్రవేశపెట్టి రాష్ట్ర పవర్‌ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఈ కేంద్రం నుంచి 85 శాతం విద్యుత్‌ రాష్ట్రానికే సరఫరా చేయనున్నారు. మొదటి యూనిట్‌ను అక్టోబరు 3న నిజామాబాద్‌ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్నారు.

Ramagundam NTPC Power generation : ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.. ఉత్పత్తి మరిచారు..!

PM Modi Nizamabad Tour : పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఎన్టీపీసీ సంస్థ తొలి దశలో 88 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్ల నిర్మాణాన్ని చేపట్టింది. అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన మొదటి యూనిట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడంతో రాష్ట్రానికి విద్యుత్‌ అవసరాలు తీరనుండగా.. మరో ఐదు నెలల్లో రెండో కేంద్రం అందుబాటులోకి రానుంది. మొదటి యూనిట్‌ను 2021 నాటికి పూర్తి చేయాల్సి ఉండగా కరోనా కారణంగా పనుల్లో జాప్యం జరిగింది.

మొదటి యూనిట్‌ను 2023 మార్చి 24న సింక్రనైజ్‌ చేసిన తర్వాత వాణిజ్య ఉత్పత్తిలోకి తీసుకోవడానికి ఆరు నెలలు పట్టింది. ఈ నెల 5న ప్రయోగాత్మకంగా ప్రారంభించి 27వ తేదీ అర్ధరాత్రి నుంచి వాణిజ్య ఉత్పత్తి చేపట్టారు. రెండో యూనిట్‌ను ఆగస్టు 24న సింక్రనైజ్‌ చేశారు. ఇది వాణిజ్య ఉత్పత్తిలోకి రావడానికి మరో ఐదు నెలలు పట్టే అవకాశం ఉంది.

NTPC Power Plant at Ramagundam : ఉజ్వల్​ భారత్​-ఉజ్వల్​ భవిష్య-పవర్​ 2047 ముగింపు కార్యక్రమంలో భాగంగా.. ప్రధాని మోదీ దిల్లీ నుంచి వర్చువల్​గా రెండు తేలియాడే సౌర విద్యుత్​ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. రూ.423 కోట్లలతో ఎన్టీపీసీ రిజర్వాయర్​లో 500 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీకి రామగుండంలో 9వేల 500 ఎకరాల స్థలం ఉంది. ఇప్పటికే అక్కడ 2,600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న థర్మల్ విద్యుత్‌ కేంద్రాలు సంస్థ నిర్వహిస్తోంది. విభజన చట్టంలోని హామీ అమలులో భాగంగా తొలి విడతగా 1,600 మెగావాట్ల అదనపు సామర్థ్యంతో రామగుండం ప్లాంట్ విస్తరణ పనులను ఎన్టీపీసీ ఇప్పటికే ప్రారంభించింది. అందులో ఇప్పుడు 800 మెగావాట్ల యూనిట్​ అందుబాటులోకి రానుంది.

దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ​క్షేత్రంగా.. రామగుండం ఎన్టీపీసీ

ఎన్టీపీసీలో నీటిపై తేలాడే పలకలతో విద్యుదుత్పత్తి

Last Updated : Sep 30, 2023, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.