PM Modi Speaks To Karimnagar Farmer : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని 2.7 లక్షల పంచాయతీల్లో, ఆయా పథకాల అర్హులను గుర్తించి, వారికి ప్రయోజనాలు చేకూరేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కరీంనగర్ జిల్లా రైతుతో ముచ్చటించారు. చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లికి చెందిన రైతు మావురం మల్లికార్జునరెడ్డితో వర్చువల్ విధానంలో ప్రధాని 5 నిమిషాలు సంభాషించారు.
విశ్వంలో భారతదేశం గొప్ప జ్ఞాన భాండాగారంగా అవతరించింది : మోదీ
PM Modi Spoke a Farmer From Karimnagar District : వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఫిబ్రవరి 2024 వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి అనుకున్న లక్ష్యాలను చేరుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తెలిపారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ సంచాలకులు యోగేశ్ మోహన్ దీక్షిత్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
ఇద్దరు ఆడపిల్లలా- అదృష్టవంతులు
ప్రధాని : మీ గురించి చెప్పండి
రైతు : సర్ నా పేరు మల్లికార్జునరెడ్డి. సమీకృత వ్యవసాయం చేస్తున్నాను. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి ఇష్టమైన సేంద్రియ సాగు విధానంలో పంటలు పండిస్తున్నాను. లాభాలు గడిస్తున్నాను.
ప్రధాని : సమీకృత సేంద్రియ వ్యవసాయం ఎందుకు అవలంబిస్తున్నారు?
రైతు : కల్తీ లేని ఉత్పత్తులతోపాటు నాణ్యమైన దిగుబడులు వస్తాయి తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.
ప్రధాని : ఇంత చదువుకొని వ్యవసాయం వైపు ఎందుకు వచ్చారు?
రైతు : నాకు చిన్నప్పటి నుంచి సేద్యంపై ఆసక్తి ఎక్కువ. అది కాకుండా తల్లిదండ్రులు చేస్తున్న వ్యవసాయానికి అండగా ఉండటంతోపాటు చదువుకున్న వారు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఇటు వైపు వచ్చాను.
ప్రధాని : వ్యవసాయంలో కుటుంబం సహకరిస్తోందా? మీకు ఎంతమంది పిల్లలు?
రైతు : కుటుంబ సభ్యుల సహకారంతోనే వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తున్నాను. వారి ప్రోత్సాహం మరువలేనిది. వారి అండతోనే అవార్డులు గెలుచుకున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు.
ప్రధాని : ఇద్దరు ఆడపిల్లలా అదృష్టవంతులు. మీకు కిసాన్ క్రెడిట్ కార్డులు, బ్యాంకు రుణాలు అందుతున్నాయా?
రైతు: మాకు కిసాన్ క్రెడిట్ కార్డులు, బ్యాంకు రుణాలు అందుతున్నాయి
ప్రధాని : బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఎంత వడ్డీకి ఇస్తున్నాయి.
రైతు: 7 శాతం వడ్డీకి ఇస్తున్నారు సార్
ప్రధాని : బ్యాంకర్లు 7 శాతం కంటే తక్కువ వడ్డీకి ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో ఒకసారి సంప్రదించండి
రైతు: సరే సర్. కానీ ఇలాంటి పథకాలపై అన్నదాతల్లో పూర్తి స్థాయిలో అవగాహన లేక సద్వినియోగం చేసుకోవడం లేదు
ప్రధాని : మీలాంటి రైతులు యువతకు పథకాలపై అవగాహన కల్పించాలి.
రైతు : అలాగే సార్
'గ్రామీణ ప్రజలను దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే భారత్ వికాస్ సంకల్ప యాత్ర లక్ష్యం'
ఆలయ పరిసరాలను శుద్ధి చేసిన ప్రధాని మోదీ- శ్రమదానం చేయాలని ప్రజలకు పిలుపు