కరోనాపై చేస్తున్న పోరులో కరీంనగర్ ప్రజలు బాగా సహకరిస్తున్నారని... ఇదే స్ఫూర్తితో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తమ వంతు సహకారాన్ని అందించాలని మేయర్ సునీల్‌రావు కోరారు. సీజనల్ వ్యాధుల నివారణపై ముద్రించిన కరపత్రాలను కమిషనర్ వల్లూరి క్రాంతితో కలిసి మేయర్ ఆవిష్కరించారు. నగరంలో అనధికారికంగా ఉన్న కుళాయి కనెక్షన్లు ఈ నెల చివరి నాటికి క్రమబద్ధీకరించుకోవాలని లేకుంటే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపు ఇచ్చిన దృష్ట్యా విధిగా సరి, బేసి విధానంలో మాత్రమే షాపులు తెరవాలని సూచించారు. మాస్కులు లేకుండా దుకాణాల్లో అమ్మకాలు జరిపిన వారికి రూ. వేయి చొప్పున ఆరువేల జరిమానా విధించామని తెలిపారు. నగరంలో ప్రతిరోజు నీటి సరఫరాకుగాను 5 టీఎంసీల నీటిని మధ్యమానేరు నుంచి దిగువ మానేరుకు విడుదల చేయడానికి అనుమతించిన సీఎం కేసీఆర్‌కు మేయర్ సునీల్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: అమ్మా.. నీ మనసు వెన్న...