లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని నిరుపేదలు, కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని పీసీసీ కార్యనిర్వాహణ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. రోజూ కూలీ పనులు చేసుకుంటేనే తిండి తినే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేయాలన్నారు.
జాతీయ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్న వారందరికీ ముందస్తుగా వేతనాలు చెల్లించి ఆదుకోవాలని సూచించారు పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలకు విద్యుత్తు మాఫీ చేస్తున్నారని... అలాగే ప్రజలందరికీ మూడు మాసాలపాటు విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు ఆది శ్రీనివాస్ జడ్పీటీసీ కుమార్ ఉన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కరోనా కలవరం... 858కి చేరిన కేసులు