కరీంనగర్లో కేసీఆర్ పార్లమెంటరీ ఎన్నికల బహిరంగ సభ...ప్రయాణికులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. సుమారు 120 బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. జిల్లా కేంద్రంలో దాదాపు 2 లక్షల మందిని తరలించేందుకు తెరాస నేతలు ఆర్టీసీ బస్సులను వాడుకున్నారు. ప్రతి రోజూ 219 బస్సులు నడపాల్సి ఉండగా...ఇవాళ 99 బస్సులు మాత్రమే నడపడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికుల ఆందోళన
శుభకార్యాలు ఎక్కువగా ఉండటం వల్ల బస్సులు లేక ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన నోటీసు బోర్డు చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను తరలించేందుకు ప్రైవేటు వాహనాలు వినియోగించాలి తప్ప ఆర్టీసీ బస్సులు వాడటం సరికాదని అంటున్నారు.అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి :తెరాస అభ్యర్థుల జాబితా సిద్ధం?