ETV Bharat / state

Huzurabad By Election: ఓట్ల కోసం పార్టీల కసరత్తు.. అంతా తెరచాటు వ్యూహమే.!

ఒక్కటంటే ఒక్కరోజే.. మిగిలింది. హుజూరాబాద్‌ ఉప పోరుకు ఘడియలు సమీపిస్తున్నాయి. ఇక్కడి శాసనసభ స్థానానికి ఎమ్మెల్యేగా ఎవరిని ఎంపిక చేసేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. రేపు జరుగనున్న పోలింగ్‌లో ఎవరికి అనుకూలంగా ఓటు వేస్తారనే సంశయం నేతల్ని వెంటాడుతోంది.

Huzurabad By Election
Huzurabad By Election
author img

By

Published : Oct 29, 2021, 1:08 PM IST

Updated : Oct 29, 2021, 4:18 PM IST

హుజూరాబాద్​లో ఇన్నాళ్లుగా సాగించిన ప్రచారం ఒకెత్తయితే నేటి రోజులో ఉన్న సమయాన్ని సద్వినియోగపర్చుకోవాలనే వ్యూహాల్లో ప్రధాన పార్టీలు మునిగి తేలాయి. ఓటర్ల చుట్టూర జరుగుతున్న లాబీయింగ్‌లో పై చేయి సాధించాలనే తపనను చూపుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే తెరతీసిన ప్రలోభాలకు అదనంగా కొన్నివర్గాల ఓట్లను ఎలా తమవైపునకు తిప్పుకోవాలనే విషయంలో ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. వాస్తవానికి ఆయా పార్టీల తరపున ఇక్కడి నియోజకవర్గానికి వచ్చి ఇన్నాళ్లుగా మకాం వేసిన నేతలంగా కోడ్‌ నిబంధనల మూలంగా సమీపంలోని సరిహద్దు మండలాల నుంచి మంత్రాగాన్ని నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఆయా గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల వారీగా ఉంటున్న నేతలతో ఫోన్‌లో సంభాషిస్తూ తగు సూచనల్ని అందిస్తున్నారు.

మందు.. మనీ.. బిర్యానీ..?

కొంతకాలంగా ఇక్కడ మద్యం పంపిణీ కీలక భూమికను పోషిస్తోంది. తాగినోళ్లకు తాగినంత మద్యాన్ని అందిస్తున్నారు. ఆయా పార్టీల తరపున ఓటర్ల ఇంటికి ఇవి రహస్యంగా చేరుతున్నాయనే ప్రచారం బాహాటంగానే వినిపిస్తోంది. కొన్ని పార్టీలు మందుతోపాటు కొంత నగదును అందిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా బిర్యానీ ప్యాకెట్లను కుటుంబంలోని ఓటర్ల సంఖ్య ఆధారంగా పంపిణీ చేస్తున్నారని తెలిసింది. వీటికి తోడుగా శీతల పానీయాలను కూడా ఓటర్ల చెంతకు చేరుస్తున్నారనే ప్రచారం ఓటర్ల ద్వారా వినిపిస్తోంది. ఓటరును మచ్చిక చేసుకునేందుకు పలురకాలుగా తాయిలాలు, నజరానాల రూపంలో ఎర వేసేందుకు కొన్ని పార్టీలు మొగ్గు చూపుతున్నాయి.

ఇదీ చూడండి: Huzurabad By Election: ఉపఎన్నిక రద్దుకు ఈసీకి కాంగ్రెస్‌ వినతి

డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై ఈసీ ఆరా.. వెంటనే స్పందించాలని ఆదేశాలు

Huzurabad Election: మంత్రి హరీశ్​రావు క్యాంపులో పోలీసుల తనిఖీలు.. ఏం దొరికాయంటే..?

Last Updated : Oct 29, 2021, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.