కరీంనగర్ జిల్లా గంగాధర వీరభద్ర స్వామి ఆలయంలో పంచమ కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలతో పండితులు స్వామి కల్యాణం జరిపారు. ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజల్లో నిమగ్నమయ్యారు.
భక్తుల కిటకిట..
స్వామివారికి వెండి కిరీటాలతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కల్యాణోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కల్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయం కిటకిటలాడింది. వేదమంత్రాలతో దేవస్థానం మార్మోగింది. దర్శనం కోసం జనం పెద్ద ఎత్తున భారులు తీరారు.
ఇదీ చూడండి: వైభవంగా గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం