ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి ఈటల - కరీంనగర్ జిల్లా సమాచారం

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో మహిళ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

Paddy sale centres started by minister etela rajender in huzurabad constituency
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి ఈటల
author img

By

Published : Nov 2, 2020, 9:20 PM IST

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. మహిళ సంఘాలు, సింగిల్​విండోల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

అక్కడే ఉన్న రైతులతో మాట్లాడి, ధాన్యం తూకం వేశారు. రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా... కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని మంత్రి ఈటల సూచించారు. సేకరించిన ధాన్యం నిలువలను వెంటనే మిల్లులుకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ కనుమల్ల విజయ, మహిళా సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కరీంనగర్ జిల్లాలో 36 ధరణి కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు షురూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.