ETV Bharat / state

'విద్యార్థుల సురక్షిత రవాణా బాధ్యత యాజమాన్యాలదే'

విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో మంచి కండిషన్​లో ఉన్న వాహనాలనే విద్యార్థుల రవాణాకు ఉపయోగించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీటీసీ చంద్రశేఖర్​ గౌడ్​ విద్యా సంస్థల ప్రతినిధులను కోరారు. విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత విద్యాసంస్థల యాజమాన్యాలదేనని తెలిపారు.

'విద్యార్థుల సురక్షిత రవాణా బాధ్యత యాజమాన్యాలదే'
'విద్యార్థుల సురక్షిత రవాణా బాధ్యత యాజమాన్యాలదే'
author img

By

Published : Aug 25, 2021, 4:20 PM IST

సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో మంచి కండిషన్​లో ఉన్న వాహనాలనే విద్యార్థుల రవాణాకు ఉపయోగించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ విద్యా సంస్థల ప్రతినిధులను కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రవాణా వాహనాల ఫిట్​నెస్, పర్మిట్ తదితర పత్రాలు సెప్టెంబర్ 30,2021 వరకు చెల్లుబాటు అయినప్పటికీ.. ప్రతీ వాహనం తప్పనిసరిగా ఫిట్​నెస్ కలిగి ఉండాలని డీటీసీ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.

గత కొన్ని నెలలుగా విద్యా సంస్థల మూసివేత వల్ల బస్సులను తిప్పని కారణంగా ఆయా బస్సులు నిస్తేజంగా ఉండి ఉంటాయని.. సెప్టెంబర్ 1 వరకు వాటికి మరమ్మతులు చేయించి మంచి కండిషన్​లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనుభవం గల డ్రైవర్​ను నియమించి విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని తెలిపారు. ఫిట్​నెస్ సరిగా లేని బస్సులు తిప్పకుండా చూడాలని కోరారు.

ఇదీ చదవండి: GHMC: 'సొంతింటి టూలెట్‌ బోర్డుకు జరిమానా లేదు.. ఉంటే మా దృష్టికి తీసుకురండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.