కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం గోపాలపురంలో ఓ వృద్ధురాలు ఓటేసేందుకు వచ్చి పోలింగ్ కేంద్రం వద్ద ఇబ్బందులు పడుతోంది. రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా కంటి చూపు మందగించిన ఓ వృద్ధురాలిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. దగ్గరుండి ఓటు వేయించారు. పనైపోయిందని ఆమెను వదిలి వెళ్లిపోయారు. గంట పాటు ఎవరైనా ఇంటికి చేరుస్తారేమోనని ఆ వృద్ధురాలు వేచిచూసింది. ఎవరూ రాకపోయేసరికి పోలింగ్ కేంద్రానికి ఓటేసేందుకు వచ్చిన యువకుడిని బతిమాలుకుంది. వృద్ధురాలి బాధను చూడలేని యువకుడు మోటార్ సైకిల్ వాహనంపై ఆమెను ఇంటికి చేర్చాడు.
ఇవీ చూడండి: అక్కడ డబ్బు పంచాడు... కటకటాలపాలయ్యాడు