పూజల అనంతరం:
ప్రజలను తెరాస నేతలు అయోమయానికి గురి చేస్తున్నారని కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ సమర్పించారు. అంతకుముందు మహాశక్తి దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు.
మద్దతుగా మంత్రి కొప్పుల:
పెద్దపల్లిలో తెరాస పార్లమెంట్ అభ్యర్థి వెంకటేష్ నామినేషన్ వేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దాసరి మనోహర్రెడ్డిలు మద్దతుగా వెళ్లారు. భాజపా అభ్యర్థిగా ఎస్.కుమార్ నామపత్రాలు సమర్పించారు. నియోజకవర్గానికి చెందిన కమలనేతలతో కలిసి పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు.