ఎంపీ బండి సంజయ్‌పై తెరాస నేతలు చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ భాజపా నాయకులు జాడి బాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అనేక మంది ఆర్టీసీ కార్మికులు మృతి చెందినా ఏ ఒక్క తెరాస నాయకులు వారి కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. జిల్లాలో కొన్ని గ్రానైట్ సంస్థలు ప్రభుత్వానికి సూమారు రూ.700 కోట్ల పన్ను ఎగనామం పెడితే, వాటిని కట్టాలని నిలదీస్తే బండి సంజయ్‌పై అభాండాలు వేయడం తెరాస నాయకులకు సిగ్గుచేటన్నారు. వారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : కమ్ముకున్న మంచు దుప్పటి