ETV Bharat / state

'నాయకుడు కావడం అదృష్టం.. దాన్ని నిలబెట్టుకోవడమే మన కర్తవ్యం' - మంత్రి ఈటల రాజేందర్

నాయకుడు కావడం తన అదృష్టమని.. దాన్ని నిలబెట్టుకోవడమే తన కర్తవ్యమని మంత్రి ఈటల పేర్కొన్నారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ పురపాలక వర్గం విజయోత్సవ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

'నాయకుడు కావడం అదృష్టం.. దాన్ని నిలబెట్టుకోవడమే మన కర్తవ్యం'

author img

By

Published : Feb 4, 2020, 11:46 PM IST

'నాయకుడు కావడం అదృష్టం.. దాన్ని నిలబెట్టుకోవడమే మన కర్తవ్యం'

దేశంలో ఎక్కడ లేని పద్ధతిలో ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా లక్షా నూటపదహారు రూపాయలను అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రమన్నారు మంత్రి ఈటల రాజేందర్​. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మున్సిపాలిటీ పాలకవర్గం విజయోత్సవ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ పాల్గొన్నారు. అంబేడ్కర్‌ కూడలి వద్ద నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చారు. ఛైర్‌పర్సన్‌ రాధిక, వైస్‌ ఛైర్​పర్సన్​ నిర్మల మంత్రి ఈటలను భారీ గజమాలలతో సన్మానించారు.

నాయకుడు కావడం అదృష్టమని.. దాన్ని నిలబెట్టకోవడమే మన కర్తవ్యమని మంత్రి ఈటల పేర్కొన్నారు. ఎక్కడ ఆపద ఉంటే అక్కడ తాను ఉంటానన్నారు. రూ.10కోట్లతో హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రిని అన్ని రకాలుగా మరింత అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు మెచ్చే పద్ధతిలో తమ ప్రవర్తన ఉంటుందన్నారు.

ఇవీ చూడండి: మేడారానికి అప్పుడే భక్తుల తాకిడి.. ఆకట్టుకుంటున్న డ్రోన్​ దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.