కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈఎస్ఐ ఆస్పత్రి లేకపోవడం వల్ల అన్ని విభాగాల్లోని కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
జిల్లా కేంద్రంలో 20 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి ఎంపీ, మంత్రి కృషి చేయకపోవడం బాధాకరమన్నారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనం నుంచి ఈఎస్ఐ పేరిట జమ చేస్తున్నా.. ఆ స్థాయిలో వైద్యం అందడం లేదని ఆగ్రహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజమల్లు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'యంగ్ సైంటిస్ట్ ఇండియా కాంపిటీషన్'కు దరఖాస్తుల ఆహ్వానం