ETV Bharat / state

విచారణకు వెళ్లిన ఎమ్మార్వోపై ప్రభుత్వ వైద్యుడి దురుసు ప్రవర్తన - mro to complaint to colector on government doctor

కరోనా పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు లేరంటూ కలెక్టర్​కు ఫిర్యాదు వచ్చింది. విచారణకు వెళ్లిన తహశీల్దార్​పై ప్రభుత్వ వైద్యుడు దురుసుగా ప్రవర్తించిన ఘటన కరీంనగర్​ జిల్లా జమ్మికుంటలో జరిగింది. ఈ విషయమై కలెక్టర్ శశాంకకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మార్వో నారాయణ వెల్లడించారు.

jammikunta doctor shouted at mro who came for enquiry
విచారణకు వెళ్లిన ఎమ్మార్వోపై ప్రభుత్వ వైద్యుడి దురుసు ప్రవర్తన
author img

By

Published : Jul 29, 2020, 9:56 PM IST

కరీంనగర్​ జిల్లా జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి కరోనా పరీక్షల కోసం ఓ వ్యక్తి వెళ్లారు. వైద్యులు లేకపోవడం వల్ల కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్​ ఆదేశాలతో విచారణ కోసం స్థానిక తహశీల్దార్ ఆసుపత్రికి వెళ్లగా ఆ ప్రభుత్వ వైద్యుడు దురుసుగా ప్రవర్తించాడని.. అతనిపై కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మార్వో స్పష్టం చేశారు. జమ్మకుంటకు చెందిన సంతోష్​ అనే వ్యక్తి కరోనా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లారు. గత కొన్నిరోజులుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా.. వైద్యుడు అందుబాటులో లేరంటూ పాలనాధికారి శశాంకకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయమై కలెక్టర్​ విచారణకు ఆదేశించగా.. తహశీల్దార్ నారాయణ ఆసుపత్రికి చేరుకుని సంతోష్​తో మాట్లాడారు. విచారణ క్రమంలో అప్పుడే వచ్చిన వైద్యుడు.. తహశీల్దార్​పై దురుసుగా ప్రవర్తించాడు. నువ్వేమైనా నా పై అధికారివా?.. నీ విభాగానికి మాత్రమే నువ్వు బాస్​వి.. మాకు కాదు అంటూ వైద్యుడు మండిపడ్డారు. విచారణకు వచ్చిన అధికారిపై ఇలా మాట్లాడటం సరికాదని తహశీల్దార్ పేర్కొన్నారు. వైద్యుడి ప్రవర్తనపై కలెక్టర్​కు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండిః 'ఆర్ఆర్ఆర్' దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.