జిల్లా కేంద్రంలో జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను ఆయన ప్రారంభించారు. కెడెట్స్, జూనియర్ విభాగాల్లో ఒడిశా, హర్యానా, దిల్లీ, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి 1000 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కిక్ బాక్సింగ్ పోటీలు కరీంనగర్లో నిర్వహించడం గర్వంగా ఉందని ఎంపీ సంజయ్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే క్రీడా మైదానాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు.
ఇదీ చూడండి: రైల్వే: పర్యటకులకు భారత్ దర్శన్ టూరిస్ట్ ప్యాకేజీ