పరిసరాల పరిశుభ్రతతోనే మెరుగైన సమాజ నిర్మాణం జరుగుతుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ పట్టణంలోని 13 వ డివిజన్లో కమిషనర్ వల్లూరు క్రాంతితో కలిసి గోదాంగడ్డ, దోబీఘాట్, బైపాస్ రోడ్డులో పాదయాత్ర నిర్వహించారు.
వీధుల్లో మురుగు నీరు నిలువ ఉండడాన్ని చూసి.... కాలనీవాసులకు అవగాహన కల్పించారు. చుట్టుపక్క ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. రానున్న వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా... జాగ్రత్తలు తీసుకోవాలని సంజయ్‌కుమార్ సూచించారు.