కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం, గునుకులపల్లె గ్రామాల్లో ఎంపీ బండి సంజయ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీ నిధుల ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను పనులను ప్రారంభించారు.
గునుకులపల్లె గ్రామ పంచాయతీ ఆవరణలో ఎంపీ మొక్క నాటి, కాపాడాలని సర్పంచ్ అమూల్యకు సూచించారు. పల్లెల అభివృద్ధి భాజపా ప్రభుత్వంతోనే సాధ్యమని బండి సంజయ్ అన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర పథకాలతో గ్రామాల్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
ఇదీ చూడండి : పట్నం గోసలో రేవంత్ రెడ్డితో వాగ్వాదం