ETV Bharat / state

Mother Died Of Heart Attack Because Son Was Suicide : కుమారుడు ఆత్మహత్యను తట్టుకోలేక.. ఆ తల్లి.. - కుమారుడు ఆత్మహత్య తల్లికి గుండెపోటు

Mother Died Of Heart Attack Because Son Was Suicide : భార్యాభర్త మధ్య జరిగిన చిన్న గొడవతో.. భార్య చెట్టుకు ఉరివేసుకొని ఏడాది క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. ఆ దుఃఖాన్ని దిగమింగలేక భర్త పెళ్లిరోజునే పురుగుల మందు తాగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుని ఆత్మహత్యను తట్టుకోలేక.. తల్లి గుండెపోటుతో మృతి చెందింది. ఈ యథార్థ ఘటన కరీంనగర్​ జిల్లాలో జరిగింది.

Mother Died
Mother Died
author img

By

Published : May 16, 2023, 6:07 PM IST

Updated : May 16, 2023, 6:18 PM IST

Mother Died Of Heart Attack Because Son Was Suicide : విధిరాత ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పడం కష్టం.. దాని ఫలితంగా మృత్యువు ఏ మార్గంలో ముంచుకొస్తుందో తెలియదు. ఆ విధి ఆడిన నాటకంలో ఏకంగా ఓ కుటుంబమే మట్టిలో కలిసిపోయింది. వివాహం జరిగి ఏడాదైనా కాలేదు.. అప్పుడే భార్య ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటిలో ఇల్లాలు లేని లోటుతో దిగులు చెంది.. భర్త కూడా ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. తన కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి సైతం గుండెపోటుతో మృత్యువాత పడింది. ఈ దృశ్యాలను చూసి.. గ్రామస్థులు కన్నీరు పెట్టుకుని.. ఇదే కదా విధి అని కన్నీరుపెట్టుకున్నారు. ఈ యథార్థ ఘటన కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​ మండలం నేదునూరు గ్రామంలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్​ జిల్లాలోని నేదునూరు గ్రామానికి చెందిన బోల్లంపల్లి శ్యాంసుందర్​కు.. హుస్నాబాద్​కు చెందిన శారద అనే మగువతో ఏడాది క్రితం వివాహం అయింది. భర్త మంచి గాయకుడు.. ఆయన రాష్ట్రస్థాయిలో కొన్ని అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. అప్పటి వరకు ఆనందంగా సాగిపోతున్న వారి సంసార జీవితంలో.. వచ్చిన చిన్న కుదుపు వారి జీవితాలనే మార్చేసి విషాదాన్ని మిగిల్చింది.

భార్య మృతిని తట్టుకోలేక.. భర్త ఆత్మహత్య : దాదాపు ఏడు నెలల క్రితం భార్య తన పుట్టింటికి వెళ్లి.. అక్కడే ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. తన ఇంటి ఇల్లాలి మరణాన్ని తట్టుకోలేక.. రోజూ దిగులుగా ఉంటూ తమ పెళ్లి రోజునే సోమవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్​మార్టం నిమిత్తం శ్యాంసుందర్​ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోస్ట్​మార్టం అనంతరం పోలీసులు.. మృతదేహాన్ని కుటుంబీకులకు అందజేశారు. అతని​ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి.. దహన సంస్కారాలు నిర్వహించారు.

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక.. తల్లికి గుండెపోటు : కుమారుని మరణం తట్టుకోలేని తల్లి.. సోమవారం అర్ధరాత్రి ఛాతిలో నొప్పి రావడంతో స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండా మార్గమధ్యమంలో ప్రాణాలను విడిచిపెట్టి.. పరలోకంలో ఉన్న కుమారుని వద్దకు వెళ్లిపోయింది. దీంతో ఒకే కుటుంబంలో తల్లి, కొడుకు, కోడలు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అందులోనూ తల్లికొడుకులు 24 గంటల్లోపే ఒకరి తర్వాత మరొకరు మృతి చెందడంతో అక్కడి ఉన్న వారందరినీ తీవ్రంగా కణచివేసింది.

ఇవీ చదవండి:

Last Updated : May 16, 2023, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.