జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఐకార్ అవార్డుకు ఎంపికైన రైతును.. ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్ద కురుమపల్లిలోని రైతు మల్లికార్జున్ రెడ్డి ఇంటికి వెళ్లి ప్రశంసించారు. వ్యవసాయంలో చేపడుతున్న నూతన పద్ధతులపై వారితో చర్చించారు.
రైతులు.. మూస పద్ధతిలో కాకుండా పంట మార్పిడితో స్వయం సమృద్ధి సాధించాలని కవిత ఆకాంక్షించారు. మల్లికార్జున్ రెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెరాస ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోరుకుంటుందని పేర్కొన్నారు. అన్నదాతల అభివృద్ధి కోసమే.. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చారని వివరించారు. కార్యక్రమంలో.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కాళేశ్వరం నీళ్లెన్ని వాడుకున్నారో లెక్కలున్నాయా: పొన్నాల