MLC Jeevan Reddy fires on TRS: జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగా శ్రావణి రాజీనామా అంశంపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పందించారు. కరీంనగర్లో విద్యుత్ శాఖ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో పాటు కరీంనగర్ జడ్పీ ఛైర్పర్సన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో మహిళలతో కంటతడి పెట్టించడం సరికాదని పేర్కొన్నారు. వారిని అణగదొక్కే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. మున్సిపల్‌లో అవిశ్వాసం మూడేళ్లకు పెట్టాలా.. నాలుగేళ్లకు పెట్టాలా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ పార్టీకే భావ సారూప్యత లేదని, ఏ జెండా లేదని ఆ పార్టీని ఎవరు పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో పొత్తుల గురించి అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. యాదాద్రి వద్ద పవర్ పాయింట్ నెలకొల్పి రాష్ట్రంలోనే ప్రజలపై 44 వేల కోట్ల భారం మోపాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి: