ETV Bharat / state

'గల్ఫ్​ బాధితుల కోసం ఎన్నారై పాలసీ రూపొందించండి' - telangana nri policy

గల్ఫ్​ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై పాలసీని రూపొందించాలని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి డిమాండ్​ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో బాధితులకు రూ. లక్ష పరిహారం చెల్లించేవారని.. తెరాస సర్కారు మాత్రం శంషాబాద్​ నుంచి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్​ పంపేందుకే పరిమితమైందని ఎద్దేవా చేశారు.

mlc jeevan reddy demands nri policy in telangana
'గల్ఫ్​ బాధితుల కోసం ఎన్నారై పాలసీ రూపొందించండి'
author img

By

Published : Feb 14, 2020, 5:02 AM IST

గల్ఫ్ దేశాల్లో మృతిచెందిన తెలంగాణ వలస జీవులను రాష్ట్రప్రభుత్వం ఆదుకోవడంలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. 10 లక్షల మంది తెలంగాణ వాసులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారన్నారు. వారందరూ ఏటా సుమారు రూ. వెయ్యి కోట్లు స్వరాష్ట్రానికి పంపిస్తున్నారని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో బాధిత కుటుంబాలకు రూ. లక్ష పరిహారం చెల్లించేవారని జీవన్​ రెడ్డి గుర్తుచేశారు. తెరాస ప్రభుత్వం మాత్రం శంషాబాద్​ నుంచి మృతదేహాన్ని తరలించాలని అంబులెన్స్​ మాత్రమే పంపిస్తోందని ఎద్దేవా చేశారు. బాధితులను ఆదుకునేందుకు ఎన్నారై పాలసీని రూపొందించాలని డిమాండ్​ చేశారు. గల్ఫ్​లో ఇటీవల మరణించిన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లికి చెందిన గోపు నరసయ్య కుటుంబాన్ని జీవన్​రెడ్డి పరామర్శించారు.

'గల్ఫ్​ బాధితుల కోసం ఎన్నారై పాలసీ రూపొందించండి'

ఇవీచూడండి: 'ఏదో ఇచ్చామని కేంద్రం చెప్పడం మంచిది కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.