కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ 35 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. మొత్తం 35 లక్షల 4 వేల రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
నిరుపేద తల్లిదండ్రులకు తమ బిడ్డల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేయడం మెచ్చుకోదగ్గ విషయమన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ బాధితులకు సీఎం భరోసా.. నేనున్నానంటూ అభయహస్తం