కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్, రామడుగు మండలం వెలిచాలల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించుకుని సరైన ధర పొందాలని కోరారు.
దళారులకు తక్కువ ధరకు పత్తిని విక్రయించుకుని మోసపోవద్దని సూచించారు. ఎనిమిది శాతం తేమ కలిగిన పత్తికి క్వింటాలుకు రూ.5825 ధరను పొందవచ్చని ప్రకటించారు. అధిక వర్షాలతో దిగుబడి తగ్గిన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: వ్యర్థాల నుంచి సంపద సృష్టిలో హైదరాబాద్ ఆదర్శం: కేటీఆర్