గంగాధర మార్కెట్ యార్డులో కందుల రైతుల కష్టాలు తీరనున్నాయి. కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా మార్కెట్ యార్డులో కందులు నిల్వచేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ యార్డుకు కందులు తీసుకొచ్చిన రైతులు తూకం సమయంలో క్రమ పద్ధతి పాటించాలని అధికారులు సూచించారు. వ్యవసాయాధికారుల నుంచి ధ్రువీకరణ పొందడం వల్ల కందులను సకాలంలో తూకం వేసేందుకు అవకాశం ఉందన్నారు.
ఇవీ చూడండి: పట్టణ ప్రగతిలో అపశ్రుతి.. ఐదేళ్ల పాప మృతి