కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో రూ. 11 కోట్ల 32 లక్షల వ్యయంతో మోయ తుమ్మెద వాగుపై నిర్మించనున్న మూడు చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతాయని, రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో మరిన్ని చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.
కరవు మండలాలైన చిగురుమామిడి, సైదాపూర్‌కు ఇప్పటికే గోదావరి జలాలు మిడ్ మానేరు కాలువల ద్వారా అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. హుస్నాబాద్‌లో కరవును తొలగించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. వచ్చే ఏడాది ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా జీవించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ రవీందర్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గొల్లపల్లి లొల్లిలొల్లి: తెరాస, భాజపా వివాదం.. పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్తం