కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల పరిధిలోని పలు గ్రామాల చెరువులను నింపడానికి కృషి చేస్తామని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అనంతగిరి, సిద్దిపేటలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని తరలిస్తామన్నారు. మండలంలోని సోమారంపేట ద్వారా వెళ్తున్న కాలువలను ఎమ్మెల్యే పరిశీలించారు.
నీటి ఎద్దడితో బోసిపోయిన భూములు, కాళేశ్వరం జలాల రాకతో పచ్చని పంట పొలాలుగా మారనున్నాయని రసమయి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతును రాజు చేయాలనే సంకల్పం నెరవేరనున్నందున ఇల్లంతకుంట మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.