MLA Rasamayi comments on kcr: మానకొండూర్ ఎమ్మెల్యేగా ఉండి డాక్టరేట్ సాధించానని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల కన్నా పెద్ద చదువు తనదేనని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్, ధర్మారం గ్రామాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచన విధానంతోనే తాను ఎంఏ, ఎంఫిల్, బీఎడ్ చదివి ఉపాధ్యాయ వృత్తి చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం వచ్చానని అన్నారు. రెండోసారి ఎమ్మెల్యే గెలిచాక డాక్టరేట్ పట్టా కోసం శ్రమించానని తెలిపారు. అంబేడ్కర్ అణగారిన, బడుగు, బలహీన వర్గాల కోసం ఆలోచించి రాజ్యాంగం రూపొందించారన్నారు.
ఇవీ చదవండి: