ఫిల్టర్బెడ్లో నీరు కలుషితం అవ్వడం వల్ల చొప్పదండి నియోజకవర్గంలోని పలు మండలాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడం వల్ల.... గ్రామాల్లో పాత రక్షిత మంచినీటి బావుల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు.
మధ్య మానేరు ప్రాజెక్టు, దిగువ మానేరు ప్రాజెక్టుల నుంచి ఫిల్టర్ బెడ్ల ద్వారా నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి, కొడిమ్యాల మండలాలకు పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ జలాశయాల్లో నీరు కలుషితమై దుర్గంధం వ్యాపించటంతో ముందు జాగ్రత్తగా నీటి సరఫరా నిలిపివేశారు.
ఇదీ చూడండి: ఆగస్టు నాటికి ప్రతి గ్రామానికీ టీ-ఫైబర్ సేవలు!